Friday, June 20, 2025
Homeగ్యాలరీHomebased Business Idea: మహిళలకు ది బెస్ట్ బిజినెస్.. అతి తక్కువ పెట్టుబడితో నెలకు రూ....

Homebased Business Idea: మహిళలకు ది బెస్ట్ బిజినెస్.. అతి తక్కువ పెట్టుబడితో నెలకు రూ. 50,000 ఆదాయం

Tailoring Small Business Idea: ఈ రోజుల్లో మహిళలు కూడా పురుషులతో సమానంగా వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. వ్యాపారం చేయాలంటే భారీ పెట్టుబడి, నష్టభయం, చదువు అవసరం అని చాలా మంది అనుకుంటారు. అయితే అది పూర్తిగా నిజం కాదు ఎలాంటి ప్రత్యేక నైపుణ్యాలు లేకపోయినా ఇంట్లో నుంచే వ్యాపారం చేయవచ్చు. దీనికి కావాల్సిందల్లా సరైన ప్రణాళిక. ఈరోజు మీరు తెలుసుకొనే వ్యాపారం ” టైలరింగ్ ” ఎలా ప్రారంభించాలి? పెట్టుబడి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

- Advertisement -

ఇంట్లో ఖాళీ ఉండే మహిళలకు ఇది ఒక అద్భుతమైన బిజినెస్. మీకు నచ్చిన సమయంలో పని చేసుకుంటూ ఆర్థికంగా స్వతంత్రంగా ఉండటానికి ఇది ఒక బెస్ట్ బిజినెస్‌ ఐడియా. ఇంతకీ ఈ బిజినెస్ ఐడియా ఏంటో మీరే తెలుసుకోండి.

ఈరోజు మనం తెలుసుకోబోయే బిజినెస్ టైలరింగ్‌కు సంబంధించింది. ఈ టైలరింగ్ వ్యాపారాన్ని తక్కువ పెట్టుబడితో కూడా ప్రారంభించవచ్చు. మీ వద్ద కుట్టు మిషన్ ఉంటే ఇక ఈ బిజినెస్ ఎంతో సులువు.

టైలరింగ్‌ పై నైపుణ్యం ఉన్నవారు ఇంట్లోనే ఈ బిజినెస్ చేయవచ్చు. ఈ బిజినెస్‌ను మీరు మీ పనులను పూర్తి చేసుకున్న తరువాత కూడా చేయవచ్చు. ఇది హిళలకు మంచి లాభాలను తీసుకొస్తుంది.

ఈ బిజినెస్‌ స్టార్ట్ చేయడానికి మీకు కేవలం రూ. 10,000 పెట్టుబడి పెట్టుకోవాల్సి ఉంటుంది. మీ వద్ద అంత పెట్టుబడి లేకపోతే ప్రధాన మంత్రి ముద్ర యోజన పథకం కింద లోన్ తీసుకోవచ్చు. ఈ డబ్బుతో మీరు వ్యాపారాన్నికి కావాల్సిన సామగ్రిని కొనుగోలు చేయవచ్చు.

టైలరింగ్ బిజినెస్‌ను అతి తక్కువ పెట్టుబడితో కూడా ప్రారంభించవచ్చు. ఈ వ్యాపారంతో మీరు నెలకు రూ. 15,000 నుంచి రూ. 50,000 సంపాదించవచ్చు. డిజైనింగ్‌ , బట్టలు కుట్టడం చేస్తే అధిక లాభాలు పొందవచ్చు.

పెళ్లిళ్లు, పండగలకు బట్టలు కుట్టించుకుంటారు. ఈ టైంలో గిరాకీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఈ సమయంలో ఎక్కువగా పని చేస్తే మంచి లాభాలు పొందుతారు.

ఈ బిజినెస్‌ ప్రాంభించిన తరువాత మీ ఫ్రెండ్స్, బంధువులకు తెలియజేయండి. కస్టమర్‌లు మరింత పెరగాలంటే సోషల్ మీడియాను ఉపయోగించండి. చాలా మంది ఇప్పుడ ఇన్​స్టాగ్రామ్​ లో రీల్స్ ద్వారా బిజినెస్‌ను ప్రచారం చేస్తున్నారు.

ఎప్పుడు కుట్టే బ్లౌజులు, సల్వార్ కమీజ్‌లు కాకుండా కొత్తగా, ఫ్యాషన్ బ్లౌజులు, డిజైనర్ డ్రెస్సులు, పిల్లల దుస్తులు, పైజామాలు వంటివి కూడా కుట్టడం వల్ల ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించవచ్చు. అలాగే మీ బిజినెస్‌కు డిమాండ్ పెరుగుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News