అవసరరానికి మించి ఎక్కువ నీళ్లు తాగడం వల్ల కూడా శరీరానికి ప్రమాదకరమట.అందుకే ఒక రోజులో ఎంత నీరు తాగాలి? అనే ప్రశ్న చాలా మందికి ఉంటుంది.
ఎక్కువ నీళ్లు తాగడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్నిసార్లు అవసరానికి మించి నీళ్లు తాగడం వల్ల మూత్రపిండాలపై ఒత్తిడి పెరుగుతుంది.
మూత్రపిండాలు నీటిని నిరంతరం ఫిల్టర్ చేయడానికి చాలా ఒత్తిడి పడుతుంది. ఇది మెదడుపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఎక్కువ నీళ్లు తాగడం వల్ల మెదడు కణాలు వాపునకు గురి చేస్తాయి.
ప్రతి వ్యక్తి రోజుకు 2.5 నుంచి 3 లీటర్ల నీళ్లు తాగితే చాలని వైద్యులు చెబుతున్నారు . అయితే మీకు ఎక్కువగా చెమట పడుతుంటే మాత్రం నీళ్లు ఎక్కువగానే తాగాలి.
నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల తలనొప్పి, నిరంతరం గందరగోళం ఏర్పడుతుందని పరిశోధనలో తేలింది.
ఎక్కువ నీళ్లు తాగడం వల్ల ఎలక్ట్రోలైట్ అసమతుల్యత వల్ల బీపీ హెచ్చుతగ్గులకు కారణమవుతుంది.