IB ACIO Jobs 2025: మీర డిగ్రీ పాసయ్యారా..? కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం పొందాలనుకుంటున్నారా..? అయితే ఈ అవకాశం మీకోసమే. కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన ఇంటెలిజెన్స్ బ్యూరో 3,717 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ నోటిఫికేషన్ కింద అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (ACIO) గ్రేడ్-II/ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ కానున్నాయి. జులై 19న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధంగా ఉండండి.