కల్కి- 2 నుంచి బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణెను తప్పించడంతో నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. దీపికా డిమాండ్స్ వల్లే కల్కి నుంచి తొలగించారని వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఆమె పర్సనల్ లైఫ్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
బాలీవుడ్లో అత్యంత డిమాండ్, అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో దీపికా పదుకొణే టాప్ ప్లేస్‌లో ఉంది. గత 18 ఏళ్లుగా సినీరంగంలో చక్రం తిప్పుతున్న ఈ పొడుగు కాళ్ల సుందరి.. నటనలోకి రాకముందు మోడలింగ్ ప్రపంచంలో ఫేమస్ మోడల్.
దీపికా జనవరి 5, 1986 న జన్మించింది. తండ్రి ప్రకాష్ పదుకొణే ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కాగా, ఆమె సోదరి గోల్ఫ్ ప్లేయర్. అయితే నటనపై ఆసక్తితో దీపికా మోడలింగ్ రంగంలో అడుగుపెట్టి.. ఎనిమిదేళ్ల వయసులోనే కెరీర్ ప్రారంభించింది.
అయితే దీపికా 12వ తరగతి మాత్రమే చదువుకున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ఆ తర్వాత వరుసగా సినిమా అవకాశాలు, షూటింగ్స్‌తో డిగ్రీ పూర్తి చేయడం కుదరలేదని తెలిపింది.
ఓం శాంతి ఓం సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన దీపికా.. తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగింది. నివేదికల ప్రకారం ఆమె ఆస్తులు రూ. 500 కోట్లు. ఒక్కో సినిమాకు రూ. 15 నుంచి రూ. 20 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుంది.
కాగా, కొద్ది రోజుల క్రితం దీపికా.. ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలు రాగా.. ఇప్పుడు కల్కి -2లో ఆమె భాగం కాదంటూ మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.