Interesting facts about Generation Z Youth: నేపాల్‌లో సోషల్ మీడియా యాప్‌లపై అక్కడి ప్రభుత్వం నిషేధం విధించడంతో జెన్ జెడ్ యువత ఆందోళనలతో రోడ్డెక్కారు. దీంతో, ఒక్కసారిగా వీరు వార్తల్లో నిలిచారు.అధునాతన స్మార్ట్‌ఫోన్‌లు విరివిగా వినియోగించే ఇంటర్నెట్ యుగంలో జన్మించిన వారే జెన్ జెడ్ కేటగిరీకి చెందిన యువత. వీరు ఆన్‌లైన్‌లో ఎక్కువ సమయం గడుపుతూ.. అప్డేటెడ్ గా ఉంటారు. వీరి గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
జెన్ జెడ్ యువత(1997-2012 మధ్య పుట్టినవారు) తలచుకుంటే ప్రభుత్వాలే కూలుతాయనడానికి నేపాల్ ఆందోళనలే నిదర్శనం.మన దేశంలో జెన్ జెడ్ పాపులేషన్ 27.1% ఉందని ఇండియా ఇన్ పిక్సెల్స్ తాజా రిపోర్ట్ స్పష్టం చేసింది.అత్యధికంగా బిహార్‌లో 32.5%, ఆ తర్వాత జమ్మూ కశ్మీర్‌లో 30.8%, ఝార్ఖండ్ 30.7% జెన్ జెడ్ జనాభా ఉంది.ఉత్తరప్రదేశ్‌లో 30%, రాజస్థాన్ 29.2%, నార్త్‌ఈస్ట్‌లో 29.2% జెన్ జెడ్ యువత ఉన్నారని నివేదిక పేర్కొంది.దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణలో 24.8%, కర్ణాటక 24.1%, ఆంధ్రప్రదేశ్‌లో 23.5%, తమిళనాడులో 22%, కేరళలో 21.8% జెన్ జెడ్ యువత ఉన్నట్లు పేర్కొంది.వీరంతా సోషల్ మీడయాలో యాక్టివ్‌గా ఉంటారని, టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ముందుంటారని నివేదిక స్పష్టం చేసింది.