ఐఫోన్ వాడే ప్రతి ఒక్కరు ఎక్కువగా ఫేజ్ చేసే సమస్య ఎదైనా ఉందంటే.. ఫోన్లో త్వరగా ఛార్జింగ్ అయిపోయవడం, లేదా ఫోన్ హీట్ ఎక్కడం. అయితే, ఫోన్ హీట్ కావడం వల్ల మీరు బ్యాటరీ కూడా త్వరగా పాడవుతుంది. కాబట్టి మీకు ఒక ఐఫోన్ యూజర్ అయితే మీ ఫోన్ హీట్ ఎక్కకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
ఐఫోన్ ఇది ప్రపంచంలో అత్యంత టాప్ బ్రాండ్లలో ఒకటైన స్మార్ట్‌ఫోన్. ఈ ఫోన్ కొనేందుకు చాలా మంది ఇష్టపడుతారు. అయితే ఐఫోన్ వినియోగదారులలో చాలా మంది ఫేజ్ చేసే సమస్య ఫోన్ హీట్టెక్కడం.
ఈ సమస్య మీ ఫోన్ బ్యాటరీ, పనితీరును కూడా ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఫోన్ హీట్ కావడానికి ముఖ్య కారణాలు ఏంటనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం.
ఫోన్ వేడెక్కడానికి బ్యాక్‌గ్రౌండ్ యాప్‌లు ప్రధాన కారణం కావచ్చు. కాబట్టి మీరు ఎప్పటికప్పుడూ బ్యాగ్రౌండ్ యాప్స్‌ను క్లియర్ చేసుకోండి. దీన్ని మార్చడానికి, కింది నుండి పైకి స్వైప్ చేయండి. పాత మోడల్‌లలో, ఉపయోగించని యాప్‌లను క్లియర్ చేసేందుకు హోమ్ బటన్‌ను డబుల్ క్లిక్ చేయండి.
ఫోన్ హీటెక్కడానికి మరో ప్రధాన కారణం భారీ గ్రాఫిక్స్ గేమ్‌లు, AR యాప్‌లు, దీర్ఘకాలంగా నడుస్తున్న లైవ్ స్ట్రీమ్‌లు. ఇవి మీ మొబైల్ ప్రాసెసర్లపై ఒత్తిడిని కలిగిస్తాయి. కాబట్టటి ఫోన్లు త్వరగా వేడెక్కడానికి కారణమవుతాయి. కాబట్టి మీ ఫోన్ హీట్ ఎక్కకుండా ఉండేందుకు తక్కువ గ్రాఫిక్స్ యూజ్ చేయండి.
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఛార్జింగ్ పెట్టి ఫోన్‌ను ఉపయోగించవద్దు. మీది స్పీడ్ చార్జర్ అయితే ఛాజింగ్ చేస్తున్నప్పుడు కూడా మీఫో హీట్ అవుతుంది. కాబట్టి ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు ఫోన్‌ను యూజ్ చేయకండి. అదేవిధంగా సేమ్ కంపెనీ ఛార్జర్‌తో ఫోన్‌ను చార్జింగ్ చేయండి.
కొన్నిసార్లు iOS బగ్ లేదా సాఫ్ట్వేర్ అప్డేట్ తర్వాత కూడా మీ ఫోన్ వేడెక్కవచ్చు. దీన్ని పరిష్కరించడానికి, మీరు తాజా iOSకి మీ ఫోన్‌ను అప్డేట్ చేసుకోండి. ఇలాంటి చిన్న ట్రిక్స్ ఫాలో అవ్వడం ద్వారా మీ ఫోన్‌ను హీట్ఎక్కకుండా, బ్యాటరీ దెబ్బతినకుండా జాగ్రత్త పడవచ్చు.