![](https://teluguprabha.net/wp-content/uploads/2025/02/janvi-10-819x1024.jpg)
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
![](https://teluguprabha.net/wp-content/uploads/2025/02/Im-going-to-call-this-Victorian-Desi-with-a-brat-girl-summer-back-1-819x1024.jpg)
మత్తెక్కించే కళ్ళతో మెస్మరైజ్ చేస్తున్న ఈ భామ రీసెంట్‌గా తెలుగులో ఎన్టీఆర్ సరసన దేవర సినిమాలో నటించి మెప్పించింది.
![](https://teluguprabha.net/wp-content/uploads/2025/02/Im-going-to-call-this-Victorian-Desi-with-a-brat-girl-summer-back-2-819x1024.jpg)
ఈ సినిమాతోనే ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఇక ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల పరంగా భారీగా వసూలు చేసింది.
![](https://teluguprabha.net/wp-content/uploads/2025/02/janvi-7-819x1024.jpg)
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన ‘RC-16’ మూవీలో నటిస్తోంది.
![](https://teluguprabha.net/wp-content/uploads/2025/02/janvi-8-819x1024.jpg)
ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే జాన్వీ.. తన లేటెస్ట్ ఫోటోలు, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది.
![](https://teluguprabha.net/wp-content/uploads/2025/02/Sundari-in-her-natural-habitat-ParamSundari-1-965x1024.jpg)
తాజాగా జాన్వీ కపూర్ ఇన్‌స్టాలో వైట్ శారీ కట్టుకున్న కొన్ని ఫోటోలు పెట్టింది.
![](https://teluguprabha.net/wp-content/uploads/2025/02/Sundari-in-her-natural-habitat-ParamSundari-1-1-965x1024.jpg)
వాటికి “సుందరి తన సహజ ఆవాసంలో” అనే క్యాప్షన్ రాసుకొచ్చింది. దీంతో ఈ ఫొటోలు కాస్తా నెట్టింట వైరల్‌గా మారాయి.
![](https://teluguprabha.net/wp-content/uploads/2025/02/Sundari-in-her-natural-habitat-ParamSundari-2-965x1024.jpg)
జాన్వీ ‘పరమ్ సుందరి’ (Param Sundari) అనే మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్నారు.
![](https://teluguprabha.net/wp-content/uploads/2025/02/Sundari-in-her-natural-habitat-ParamSundari-3-965x1024.jpg)
ఆ సినిమా ప్రమోషన్లలో భాగంగానే ఆ బ్యూటీ ఈ ఫొటోస్ షేర్ చేసినట్లు తెలుస్తోంది.