Sunday, July 13, 2025
Homeగ్యాలరీJob Notification: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Job Notification: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Job Notification released: తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన యూనివర్సిటీల్లో ఉన్న మొత్తం 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి పచ్చ జెండా ఊపింది. ఈమేరకు మెడికల్ అండ్ హెల్ట్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. మల్టీ జోన్-1లో 379 పోస్టులు ఉండగా.. మల్టీ జోన్-2లో 228 పోస్టులు ఉన్నాయి.

- Advertisement -

ఆసక్తి గల అభ్యర్థులు http://mhsrb.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. జులై 10 నుంచి జులై 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అలాగే జులై 19వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు అభ్యర్థులు దరఖాస్తులను ఎడిట్ చేసుకోవచ్చు.

ఒకటి కన్నా ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు.. వేరువేరుగా దరఖాస్తుకు చేసుకోవాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఈ పోస్టులకుఎంపికైన అభ్యర్థులకు యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ నిబంధనల ప్రకారం నెలకు రూ.68,900 నుంచి రూ.2,05,500 జీతం లభించనుంది.

ఈ నోటిఫికేషన్ ప్రకారం ఉస్మానియా యూనివర్శిటీ పరిధిలని శాతవాహన యూనివర్శిటీ, కాకతీయ యూనివర్శిటీ, పాలమూరు యూనివర్శిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాల ప్రక్రియ జరగనుంది.

ఇదే కాకుండా మరో 8 యూనివర్సిటీల్లో కూడా ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అధికారులు కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం. 15 ఏళ్లకుపైగా పనిచేస్తున్న కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు మాత్రం అలాగే కొనసాగనున్నారు. అయితే ఖాళీగా ఉన్న స్థానాలను మాత్రమే భర్తీ చేయనున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News