పెళ్లి తర్వాత కాజల్ అగర్వాల్ కెరీర్‌తో పాటు ఫ్యామిలీకి కూడా ఇంపార్టెన్స్ ఇస్తుంది కాదల్. బిడ్డ పుట్టిన తర్వాత ఫ్యామిలీతో కలిసి వెకేషన్ అంటూ ఫుల్ చిల్ అవుతుంది. తాజాగా మాల్దీవుల్లో కాజల్ అగర్వాల్ ఎంజాయ్ చేస్తున్న ఫొటోలని షేర్ చేసింది.
భర్త గౌతమ్ కిచ్లూతో కలిసి మాల్దీవులు వెళ్లారు కాజల్ అగర్వాల్.సముద్ర తీరంలో ఇసుకలో ఆటలు ఆడుతూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న చందమామ.
పెళ్లి తర్వాత కాజల్ హవా కాస్త తగ్గింది. ఇప్పటికీ కూడా కాజల్ భారీ చిత్రాల్లో అవకాశాలు అందుకుంటోంది.
డిఫెరెంట్ అవుట్ ఫిట్స్ లో కాజల్ మాల్దీవుల్లో మెరిసింది. మాల్దీవులపై నా ప్రేమ ఎప్పటికీ చెరిగిపోదు. ప్రకృతిని ఎంతో అందంగా తీర్చి దిద్ది చూపించే ప్రదేశం ఇది. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి నాకు కొత్త అనుభూతి కలుగుతుంది అని కాజల్ చెప్పుకొచ్చింది.
కాజల్ అగర్వాల్ 2007లో లక్ష్మీ కళ్యాణం చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.ప్రస్తుతం బాలీవుడ్ లో తెరకెక్కుతున్న రామాయణం చిత్రంలో నటిస్తోంది. మండోదరి పాత్రలో నటిస్తోంది.
మగధీర మూవీ కాజల్ కెరీర్ ని మలుపు తిప్పింది. ఈ మూవీతో కాజల్ టాలీవుడ్ లో నంబర్1 హీరోయిన్ గా కొనసాగుతూ..స్టార్ హీరోలందరి పక్కన యాక్ట్ చేసింది.