గ్లామర్‌తో పాటు పర్ఫామెన్స్తో తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకున్న ముంబయి భామ కామ్నా జెఠ్మలానీ ఇప్పుడు మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్‌తో అలరించబోతుంది.
2005లో ప్రేమికులు సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమై ఈ ముద్దుగుమ్మ.. రణంతో సూపర్ స్టార్‌డమ్‌ను సంపాదించుకుంది. ఆ తర్వాత అల్లరి నరేష్‌తో చేసిన కత్తి కాంతారావు, బెండు అప్పారావు కామెడీ సినిమాల్లో అల్టిమేట్ పర్ఫామెన్స్తో ఆకట్టుకుంది.
ఆ తర్వాత కింగ్, సైనికుడు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌తో ఆకట్టుకున్నా.. ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకపోయింది. ఇప్పుడు 12 ఏళ్లు సుదీర్ఘ విరామం తర్వాత టాలీవుడ్లో మళ్లీ అడుగుపెట్టబోతోంది.
2014లో బెంగళూరుకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త సూరజ్ నాగ్‌పాల్‌ను కామ్నా వివాహం చేసుకుంది. వివాహం తర్వాత పూర్తిగా నటనకు దూరమైన ఈ సీనియర్ హీరోయిన్.. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ‘కె ర్యాంప్’ సినిమాతో తెరపై కనిపించనుంది.
జైన్స్ నాని దర్శకత్వంలో వహిస్తున్న ‘కె ర్యాంప్’ చిత్రంలో కిరణ్ అబ్బవరం హీరో.. యుక్తి తరేజ హీరోయిన్, చైతన్ భరద్వాజ్ సంగీతం. అక్టోబర్ 18న సినిమా విడుదల కానుంది.
ఇప్పటికే విడుదలైన ‘కె ర్యాంప్’ ట్రైలర్‌కు మంచి స్పందన వస్తుండటంతో కామ్నా జెఠ్మాలనీ రోల్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.