Wednesday, April 2, 2025
Homeగ్యాలరీKetika Sharma: అదిదా సర్‌ప్రైజు.. కేక పుట్టిస్తున్న కేతిక శర్మ..!

Ketika Sharma: అదిదా సర్‌ప్రైజు.. కేక పుట్టిస్తున్న కేతిక శర్మ..!

24 డిసెంబర్ 1995న ఢిల్లీ నగరంలో ఓ హిందూ కుటుంబంలో జన్మించింది వయ్యారి భామ కేతిక శర్మ.

- Advertisement -

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని లా మార్టినియర్ బాలికల పాఠశాలలో స్కూలింగ్ విద్యను పూర్తిచేసింది ఈ ముద్దుగుమ్మ.

ఢిల్లీ నగరంలో ఉన్న మిరాండా హౌస్, ఢిల్లీ విశ్వవిద్యాలయంలో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది ఈ అందాల తార.

చదువు పూర్తయ్యాక మోడలింగ్ లో తన కెరీర్ ను ప్రారంభించింది. ఇక ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేకుండా సినీరంగంలోకి అడుగుపెట్టింది కేతిక శర్మ.

టిక్ టాక్ వీడియోస్, షార్ట్ ఫిల్మ్స్ ద్వారా సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకుంది. అందం, అభినయంతో కుర్రకారును కట్టిపడేసింది కేతిక శర్మ.

ఆ తర్వాత తెలుగు సినిమాల్లో వరుస అవకాశాలు అందుకుంది ఈ వయ్యారి భామ.

రంగరంగ వైభవంగా సినిమాతో పాటు బ్రో సినిమాలో కథానాయకిగా కనిపించి.. మంచి మార్కులు కొట్టేసింది.

ఇక తాజాగా నితిన్ హీరోగా నటించిన రాబిన్‎హుడ్‎ సినిమాలో స్పెషల్ సాంగ్‎ లో అలరించింది.

అదిదా సర్‌ప్రైజు అంటూ కేతిక శర్మ చేసిన డ్యాన్స్ కి కుర్రకారు ఫిదా అయిపోయారు. ఈ సినిమాత తర్వాత ఈ అమ్మడికి వరుస ఆఫర్లు అందుతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

మరోవైపు కేతిక శర్మకి సోషల్ మీడియాలో ఫాలోవర్లు కూడా ఎక్కువే. తరచూ తాజా ఫోటోలు వీడియోలతో కుర్రకారుని మత్తెక్కిస్తుంది ఈ ముద్దుగుమ్మ.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News