ఉప్పెనతో బేబమ్మగా కుర్రాళ్ల మనసులను కొల్లగొట్టింది కృతిశెట్టి. తర్వాత శ్యామ్ సింగరాయ్తో మరో హిట్ కొట్టింది.
ప్రస్తుతం కార్తీకి జోడీగా కృతి శెట్టి.. ‘అన్నగారు వస్తారు’లో నటిస్తోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో బేబమ్మ ఆసక్తికర విషయాలు పంచుకుంది.
ఉప్పెన సినిమా తన జీవితాన్ని మార్చేసిందని కృతి చెప్పుకొచ్చింది. ఆ సినిమా సమయంలో ఒత్తిడి వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపింది.
ఒత్తిడి కారణంగా జుట్టు విపరీతంగా రాలిపోయిందని.. చర్మ సంబంధిత సమస్యలు ఎదుర్కొన్నానని వెల్లడించింది. కానీ, నటన అనేది డిమాండ్ ఉన్న పని.. నటిగా అన్నిటికి సిద్ధమై ఉండాలని చెప్పుకొచ్చింది.
ఒకానొక సమయంలో సినీ జర్నీ ఆపేద్దామనుకున్నా అని.. కానీ ఉప్పెనతో ప్రేక్షకుల ఆదరాభిమానులు చూశాక సినీ కెరీర్లో కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది.
సోషల్ మీడియాలో పోస్టులు, విమర్శలు తనకెంతో బాధ కలిగించాలని కన్నీళ్లు పెట్టుకుంది. క్లిష్ట సమయాల్లో తన తల్లి ఎంతో అండగా ఉన్నారని భావోద్వేగానికి గురైంది కృతి శెట్టి.