Latest Fruit Business Idea: నేటి కాలంలో చాలా మంది సొంతంగా వ్యాపారం ప్రారంభించి తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. చాలా మంది చిన్న వ్యాపారాలను ప్రారంభిస్తున్నారు. బిజినెస్ నిపుణుల ప్రకారం వ్యాపారం ఒక మహాసముద్రం లాంటిది ఇందులో ఎదురయ్యే సవాళ్లను తెలివితేటలతో అధిగమించాలని చెబుతున్నారు. దీంతో పాటు నష్టాలను, లాభాలను ఒకే విధంగా చూడటం చాలా ముఖ్యం. అయితే మీరు కూడా సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని ఆలోచిస్తున్నారా? ఈ బిజినెస్ ఐడియా మీకోసం..

మార్కెట్‌లో ప్రస్తుతం చిన్న వ్యాపారాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా యువత, మహిళలు ఈ ట్రెండ్‌ను అనుసరిస్తున్నారు. దీని ద్వారా వచ్చే లాభాలతో తమ కలలను నెరవేర్చుకోవడంతో పాటు ఆర్థికంగా తమ కాళ్ల మీద నిలబడుతున్నాను.

వ్యాపారం కేవలం డబ్బు సంపాదనకు మాత్రమే కాకుండా వ్యక్తిగత గుర్తింపును, ఇతర నైపుణ్యాలను కూడా పెంపొందించుకోవడానికి ఒక గొప్ప మార్గం. వ్యాపారంతో మనం మనకు మనమే యజమానులుగా ఉండవచ్చు. అయితే మీరు కూడా సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నారా?

ఈరోజు మీరు తెలుసుకొనే బిజినెస్ ” పండ్ల వ్యాపారం”. ఈ వ్యాపారాన్నికి మార్కెట్లో ఎల్లప్పుడు డిమాండ్ ఉంటుంది. చాలామంది తాజా పండ్లనుకొనడానికి ఇష్టపడుతారు కాబట్టి బిజినెస్ విజయవంతం కావడం సులభం అలాగే పోటీ కూడా ఎక్కువ.

కస్టమర్‌లు ఎప్పుడు నాణ్యత కలిగిన పండ్లను కొంటారు కాబట్టి రైతుల నుంచి నేరుగా కోనుగోలు చేయడం మంచిది. లేదా మీకు నమ్మకమైన సరఫరాదారులతో పండ్లను పొందవచ్చు. ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మీరు మంచి స్థలాన్ని చూసుకోండి. ముఖ్యంగా రద్దీగా ఉండే ప్రదేశాలలో చిన్న కార్ట్‌ని ఏర్పటు చేసుకోండి. దీంతో వ్యాపారం పెరిగే అవకాశం ఉంటుంది.

సీజనల్ పండ్లతో పాటు ఎల్లప్పుడు మార్కెట్లో లభించే పండులను కూడా నిల్వ చేసుకోండి. మీ వ్యాపారం మరింత లాభాలు పొందాలంటే పండ్లతో తయారు చేసే సలాడ్స్, జ్యూస్‌లను కూడా తయారు చేసి అమ్మవచ్చు. దీంతో మరింత డిమాండ్ పెరుగుతుంది.

ఈ బిజినెస్ ప్రారంభించడానికి రూ. 10,000 పెట్టుబడి సరిపోతుంది. మీ వద్ద అంత డబ్బు లేకపోతే ప్రధానమంత్రి ముద్ర యోజన పథకం కింద లోన్ కూడా తీసుకోవచ్చు. ఇందులో ఎలాంటి వడ్డీ ఉండదు.

ఈ పండ్ల బిజినెస్‌తో మీరు నెలకు రూ. 60,000 సంపాదించవచ్చు. మీ వ్యాపారం మరింత పెరగాలంటే ఆన్‌లైన్‌లో డెలివరీ సేవలను ప్రారంభించండి. సోషల్ మీడియాలో కూడా మీ బిజినెస్ గురించి పోస్ట్‌లు చేయండి. ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం పండ్ల వ్యాపారం అనేది శ్రమతో కూడుకున్నప్పటికీ సరైన ప్రణాళికతో లాభాలను పొందవచ్చు.