Anaswara Rajan viral pics: మలయాళ ముద్దుగుమ్మ అనస్వర రాజన్ తన అందంతో కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రీసెంట్ ఆమె ఇన్ స్టాలో షేర్ చేసిన హాట్ హాట్ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
మలయాళ నటి అనస్వర రాజన్ ఇండస్ట్రీకి బాలనటిగా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది.
2017లో వచ్చిన ‘ఉదాహరణం సుజాత’ సినిమాతో ఆమె సినీరంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత తన్నీర్ మథన్ దినంగల్, సూపర్ శరణ్య వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.
2022లో త్రిష లీడ్ రోల్ చేసిన రాంగి మూవీతో కోలీవుడ్ లోకి, 2023లో వచ్చిన యారియన్ 2తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.
రీసెంట్ గా ‘మిస్టర్ అండ్ మిసెస్ బ్యాచిలర్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి దీపు కరుణాకరమ్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ అమ్మడు త్వరలోనే టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుందనే వార్తలు వస్తున్నాయి. 7/జి బృందావన కాలనీ రీమేక్ కు కోసం ఈమెను సంప్రదించినట్లు తెలుస్తోంది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ తన అందాలతో కుర్రకారుకు ఎరవేస్తుంది. ఆమె లేటెస్ట్ పిక్స్ నెట్టింట సెగలు రేపుతున్నాయి.