మెగాడాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం. కాగా.. ఇప్పుడు ఈ చిన్నది చీరలో తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం. ఈ అమ్మడు హీరోయిన్ తన లక్కు పరీక్షించుకొని, ఇప్పుడు నిర్మాతకగా మారి సక్సెస్‌తో దూసుకెళ్తుంది.
ఈ బ్యూటీ మొదట యాంకర్‌గా చేసింది. తర్వాత ఒక మనసు సినిమాలో హీరోయిన్ గా చేసి తన లక్కు పరీక్షించుకుంది. ఈ మూవీలో ఈ అమ్మడు నటనకు మంచి మార్కులు పడ్డాయి. అంతే కాకుండా ఈ మూవీ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది.
అయితే ఈ సినిమా తర్వాత నిహారిక మూవీస్ చేస్తుందని అందరూ ఊహించారు. కానీ ఎవరూ ఊహించని విధంగా, జీవీ చైతన్య అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కానీ, వైవాహిక జీవితంలో ఫెయిలయ్యింది. అతడితో విడాకులు తీసుకుంది.
విడాకుల తర్వాత ఈ బ్యూటీ సినీ ఫీల్డ్ లో దూసుకెళ్తుంది. మంచు మనోజ్ సరసన వాట్ ద ఫిష్ సినిమాలో హీరోయిన్ గా నడిస్తోంది. అంతే కాకుండా, నిర్మాతగా మారి సినిమాలు తీస్తోంది.
కమిటీ కుర్రాళ్లు సినిమాను నిర్మించి మొదటి ప్రయత్నంలోనే మంచి సక్సెస్ అందుకుంది. నిర్మాతగా మారి మొదటి సక్సెస్‌తో ఎంజాయ్ చేస్తుంది. ఇక ఈ బ్యూటీ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకుంటుంది.
తాజాగా ఈ బ్యూటీ చీరలో సిగ్గు పడుతూ, పలు ఫొటోలకు ఫోజులిచ్చింది. అందులో ఈ అమ్మడు అందం, చూస్తే ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
చీరలో ఈ బ్యూటీ పోస్టు చేసిన వీడియోలకు సోషల్ మీడియాలో తెగ లైక్స్, కామెంట్స్ వస్తున్నాయి.