ప్రస్తుతం చాలా మంది వ్యాయామంతో పాటు ఆహారం విషయంలో చాలా శ్రద్ధ వహిస్తున్నారు. ముఖ్యంగా మిల్లెట్స్‌ను భోజనంలో భాగం చేసుకుంటున్నారు. పూర్వీకులు తిన్న ఈ చిరు ధాన్యాలపై ఇప్పుడు ప్రజల్లో మక్కువ పెరిగింది.
మిల్లెట్స్‌లో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల అనేక వ్యాధులను తగ్గించడానికి దోహదపడుతుంది. అయితే భిన్న రకాల వ్యాధులను బట్టి సిరి ధాన్యాలు తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే ఫలితం ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు.
ఫాక్స్‌టెయిల్ మిల్లెట్స్(కొర్ర)ల్లో ఫైబర్, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి గర్భిణీలకు ఎంతో మేలు చేస్తాయి. జ్వరం వచ్చిన చిన్నారులకు కొర్రలను పెడితే త్వరగా కోలుకుంటారు. కొర్రలను తినడం వల్ల నరాల బలహీనత, చర్మ సమస్యలు, నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, పార్కిన్సన్ వ్యాధి, ఆస్తమా వంటి సమస్యలు ఉన్నవారికి ఎంతగానో మేలు జరుగుతుంది.
సామలు లేదా లిటిల్ మిల్లెట్స్ ద్వారా ఫర్టిలిటీ సమస్యలను నివారించవచ్చు. మెదడు, గొంతు సమస్యలు, బ్లడ్ క్యాన్సర్, థైరాయిడ్, క్లోమ గ్రంథి సమస్యలు తగ్గుతాయి. ఊదలు తీసుకోవడం వల్ల థైరాయిడ్, షుగర్ ఉన్నవారికి మేలు.
రాగులతో రక్త శుద్ధి, ఎముకలు దృఢంగా, కండరాలకు శక్తి లభిస్తుంది. క్యాన్సర్, షుగర్ ఉన్నవారికి మేలు. సజ్జలతో జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. షుగర్ లెవల్స్ తగ్గుతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గర్భిణీలకు మేలు జరుగుతుంది.
జొన్నలు లేదా సోర్గమ్ మిల్లెట్స్‌ను తింటుంటే మలబద్దకం తగ్గుతుంది, జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. అధిక బరువు తగ్గుతారు. కండరాలకు శక్తి లభిస్తుంది. డయాబెటిస్ అదుపులో ఉంటుంది.