
మిర్నా మీనన్ వరుస సినిమాలతో బిజీగా మారింది. జైలర్ మూవీలో రజనీకాంత్ కోడలి పాత్రలో కనిపించింది మిర్నా మీనన్ . జైలర్ సీక్వెల్‌లో కూడా మిర్నా మీనన్ నటిస్తోంది.

1992, డిసెంబర్ 15న కేరళలోని ఇడుక్కి జిల్లాలో జన్మించింది. తండ్రి సంతోష్ కుమార్, తల్లి శోబనా సంతోష్, ఇద్దరు అన్నలు ఉన్నారు.

స్కూలింగ్‌ను కేరళలో పూర్తి చేసి, చెన్నైలో సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీలో ఇంజినీరింగ్ చదివింది మిర్నా మీనన్.

మొదట్లో ఫ్రీలాన్స్ మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన మిర్నా మీనన్.. కొచ్చిలో జరిగిన ఫ్యాషన్ షోలో ర్యాంప్‌పై కూడా చేసింది.

ఇక 2016లో పట్టతారి అనే తమిళ చిత్రంలో హీరోయిన్ గా అరంగేట్రం చేసింది. ఇక 2020లో బిగ్ బ్రదర్ సినిమాతో తొలిసారి మలయాళంలో మెప్పించింది. 2022లో క్రేజీ ఫెలో అనే చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది.

2023లో అల్లరి నరేష్‌కి జోడిగా ఉగ్రంలో కనిపించింది. ఈ సినిమాతో తెలుగులో తొలి విజయాన్ని అందుకుంది. అదే ఏడాది జైలర్‌లో తలైవా కోడలిగా కనిపించి మరో విజయాన్ని సొంతం చేసుకుంది.

అదితి మోహన్ పేరుతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత తన పేరును మిర్నా మీనన్‌గా మార్చుకుంది.

ప్రస్తుతం తెలుగులో డాన్ బాస్కో అనే సినిమా చేస్తోంది మిర్నా మీనన్.