ప్రకృతిలో ఉండే ప్రతీ చెట్టు, ఆకుల్ని కూడా ఆరోగ్యాన్ని పంచే మూలికల్లానే చూస్తున్నారు. అందులో మునగాకు కూడా ఒకటి
మునగని అమృతంలానే చూస్తున్నారు. దీని ఆకులు, కాయలు, కాండం, వేరు ఇలా ప్రతీది కూడా ఆరోగ్యానికి ఎంతగానో మంచిది. మునగాకుల్లో ప్రోటీన్, ఐరన్, కాల్షియం, విటమిన్ ఎ, సి, బి కాంప్లెక్స్ వంటి పోషకాలు ఉంటాయి.
మునగాకుల్లో ఫైబర్ పుష్కలంగా పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థని ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంతో మలబద్దకం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు తగ్గుతాయి.
మునగని ఉదయాన్నే తీసుకుంటే లివర్, కిడ్నీలు కూడా డీటాక్స్ అవుతాయి. మనం రోజూ తీసుకునే ఆహారం, డ్రింక్స్, పొల్యూషన్ కారణంగా మన బాడీలోకి ట్యాక్సిన్స్ ప్రవేశిస్తాయి.
వాటిని దూరం చేసుకోవడానికి ముందుగా మునగని మన డైట్లో యాడ్ చేసుకుంటే అలాంటి విషపూరితమైన ట్యాక్సిన్స్ బాడీ నుంచి బయటికొస్తాయి.
మునగని తీసుకోవడం వల్ల బాడీలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కూడా బ్యాలెన్స్ అవుతుంది. దీని వల్ల గుండె సమస్యలు, రావు. బరువు పెరగరు.
కొలెస్ట్రాల్ తగ్గించుకునేందుకు మెడిసిన్స్ వాడే బదులు నేచురల్‌గానే తగ్గించుకోవాలి. దీనికోసం మునగాకుల్ని తీసుకుంటే నేచురల్‌గానే కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది.