మునగ అంటే తెలియని తెలుగు వారుండరు. మునగకాయలతో రకరకాల రుచికర వంటలు దాదాపు అన్ని ఇళ్లల్లో వండేస్తుంటారు. ఇక మునక ఆకు కూడా చాలా మందికి ఎంతో ఇష్టం. అయితే మునగ ఆకు పొడి గురించి మీరెప్పుడైనా విన్నారా? ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం.
మునగకాయలతో రకరకాల రుచికర వంటలు దాదాపు అన్ని ఇళ్లల్లో వండేస్తుంటారు. ఇక మునక ఆకు కూడా చాలా మందికి ఎంతో ఇష్టం. అయితే మునగ ఆకు పొడి టేస్ట్ చేశారా? ఈ పొడిలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.
ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా ఇది మహిళల ఆరోగ్య సమస్యలకు ఎంతో మేలు చేస్తుంది. మునగలో ఐరన్ అధికంగా ఉంటుంది.ఇది రక్తహీనతను నివారిస్తుంది. ఇది రక్తంలో హిమోగ్లోబిన్‌ను పెంచుతుంది. ఇందులో విటమిన్ బి, కాల్షియం, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి.ఇది అలసటను తగ్గిస్తుంది. శరీరానికి సహజ శక్తిని అందిస్తుంది.
మహిళల్లో హార్మోన్ల అసమతుల్యతను తగ్గిస్తుంది. పీరియడ్స్ సమస్యలను తగ్గిస్తుంది. గర్భిణీలకు, పాలిచ్చే తల్లులకు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో ఉండే కాల్షియం, ఇనుము, ప్రోటీన్ గర్భిణీలకు కావల్సిన పోషకాలను అందిస్తుంది.
మునగ పొడిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఒత్తిడిని తగ్గించి, మనసును ఉల్లాసంగా ఉంచుతాయి. ఉదయం ఖాళీ కడుపుతో ఈ పొడిని గోరువెచ్చని నీటిలో లేదా పాలతో కలిపి తీసుకోవచ్చు. మీరు దీన్ని స్మూతీలు, జ్యూస్‌లు, సూప్‌లు, ఇతర పప్పు వంటలలో కూడా కలపవచ్చు.
తక్కువ రక్తపోటు, థైరాయిడ్ వంటి ఆరోగ్య సమస్యలకు మందులు తీసుకుంటుంటే వైద్యుడి సలహా మేరకు దీన్ని తీసుకోవాలి. దీన్ని అధికంగా తీసుకుంటే కడుపు నొప్పి, వికారం, విరేచనాలు వంటి సమస్యలు వస్తాయి.