
మృణాల్ ఠాకూర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సీతారామం సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్‌గా మారింది.

హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమాతో మృణాల్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. తొలి సినిమాతోనే తన అందం, అభినయంతో కట్టిపడేసింది.

సీతామహాలక్ష్మీ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది. తొలి సినిమాతోనే మంచి విజయం సాధించింది. ఆ తర్వాత తెలుగులో ఈ అమ్మడి క్రేజ్ పెరిగిపోయింది.

తక్కువ సమయంలోనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది మృణాల్ ఠాకూర్.

ఇక నేచురల్ స్టార్ నానితో కలిసి హాయ్ నాన్న అనే సినిమా చేసింది. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది.

ఆ తర్వాత ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఫ్యామిలీ స్టార్ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కానీ మృణాల్ నటనకు మాత్రం మంచి క్రేజ్ వచ్చింది.

సౌత్ ఇండియా సినిమాలతో పాటు.. బాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది మృణాల్ ఠాకూర్.

మరోవైపు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు గ్లామరస్ పిక్స్ పోస్ట్ చేస్తూనే ఉంటుంది.

తాజాగా మృణాల్ ఠాకూర్ క్లాస్ లుక్స్ తో ఉన్న ఫోటోలు షేర్ చేయగా.. ఇవి కుర్రకారును తెగ ఆకట్టుకుంటున్నాయి.