అందాల ముద్దుగుమ్మ నేహా శెట్టి డీజే టిల్లు సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ సరసన రాధిక పాత్రలో నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది.
ఈ అమ్మడు ఆకాశ్ పూరీ హీరోగా వచ్చిన మెహబూబా సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది.సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నేహా శెట్టి ఎప్పుడూ తన అంద చందాలతో కుర్రకారును ఫిదా చేస్తుంది.తాజాగా ఈబ్యూటీ మాల్దీవ్స్‌లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్‌ను తన అభిమానులతో పంచుకుంది. అందులో ఈ బ్యూటీని చూస్తే మతిపోవాల్సిందే.బ్లూకలర్ డ్రెస్‌లో, అదిరిపోయే లుక్‌లో ఫొటోలకు ఫోజులిచ్చింది. చల్లటి గాలిని ఆస్వాదిస్తూ.. సముద్రంలో చిల్ అవుతుంది.ఫొటోస్ ఈ బ్యూటీ షేర్ చేస్తూ.. మాల్దీవ్స్ ఒక కలలా ఉంది. నా కోసమే తయారు చేసినట్లు ఉంది ఈ హాలీడే ట్రిప్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.