Tuesday, February 10, 2026
Homeగ్యాలరీBank Holidays: వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులకు సెలవులు

Bank Holidays: వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులకు సెలవులు

Bank Holidays Next Week: మరో వారం రోజులో జూన్ నెల ముగియనుంది. ఈ వారంలో బ్యాంకులకు వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. ఈ సెలవులు అన్ని రాష్ట్రాల్లో ఒకేలా ఉండకపోవచ్చు. ఆయా రాష్ట్రాల పండగలు, కార్యక్రమాలను బట్టి ఉంటాయి.

- Advertisement -

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) జూన్ నెలలో మొత్తం 12 సెలవులు ప్రకటించింది. ఇందులో వివిధ రాష్ట్రాల పండుగలతో పాటు సాధారణ సెలవులు కూడా ఉన్నాయి.

ఈ వారంలో బ్యాంకులకు ప్రాంతీయ పండుగలు, వారాంతపు సెలవులతో కలిపి వరుసగా 3 సెలవులు ఉన్నాయి. జూన్ 27 ఒడిశాలో రథయాత్ర/కాంగ్ సందర్భంగా ఆ రాష్ట్రంలో బ్యాంకులు మూసివేయబడతాయి.

ఇక జూన్ 28వ తేదీ నాలుగో శనివారం కావడంతో దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు ఉంటుంది. జూన్ 29 ఎలాగో ఆదివారం కాబట్టి బ్యాంకులు తెరుచుకోవు. జూన్ 30 రెమ్నా ని పండుగ సందర్భంగా మిజోరంలో బ్యాంకులు మూసివేయబడతాయి.

అందుచేత కస్టమర్లు తమ బ్యాంకు పనులు సెలవుల ఆధారంగా ప్లాన్ చేసుకోండి. అయితే బ్యాంకులు మూసి ఉన్నప్పటికీ UPI, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ సేవలు యథావిధిగా పనిచేస్తాయి.

కానీ చెక్కు క్లియరెన్స్, డిమాండ్ డ్రాఫ్ట్(డీడీ), పాస్‌బుక్ అప్‌డేట్‌లు వంటి కొన్ని సేవలు మాత్రం బ్యాంకుల్లోనే సాధ్యమవుతాయి. కాబట్టి ఇలాంటి పనులను అవసరమైతే సెలవులకు ముందే పూర్తి చేసుకోవడం మంచిది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News