కొంతమందికి తరచుగా వచ్చే పీడకలలు వారి దైనందిన జీవితంపై ప్రభావం చూపిస్తుంటాయి. దీనినే దుస్వప్న రుగ్మత(Nightmare Disorder) అంటారు. అసలు ఇవి ఎందుకు వస్తాయి. కారణాలు ఇక్కడ తెలుసుకుందాం..
తరచుగా వచ్చే పీడకలలతో పగటిపూట ఏకాగ్రత, మానసిక స్థితి, శక్తిని ప్రభావితం చేస్తాయి. మానసికంగా తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్.. దీనికి కారణాలు అని వైద్య నిపుణులు చెబుతున్నారు.
జీవనశైలి సక్రమంగా లేని నిద్ర షెడ్యూల్, ఆల్కహాల్ సేవించడం లేదా నిద్రపోయే ముందు అతిగా ఆహారం తీసుకోవడం కూడా పీడకలలకి కారణాలు అని విశ్లేషిస్తున్నారు.
అయితే నైట్ టెర్రర్స్, పీడకలలు వేర్వేరు సమస్యలు. నైట్ టెర్రర్స్ అనేది గాఢ నిద్రలో సంభవిస్తుంది. ఇందులో వ్యక్తి అరిచినా లేదా ఉలిక్కిపడి లేచినా తరువాత ఏమి జరిగిందో గుర్తుంచుకోలేరు.
కానీ పీడకలలు మాత్రం మేల్కొన్న తర్వాత కూడా చాలా స్పష్టంగా జ్ఞాపకం ఉంటాయి. ఇవి నేరుగా ప్రాణానికి హాని కలిగించకపోయినా.. అవి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపి ఆత్మహత్య ఆలోచనలను కలిగించవచ్చు.
వీటిని తగ్గించుకోవడానికి స్థిరమైన నిద్రా సమయం, పడుకునే ముందు పుస్తకాలు చదవడం లాంటి రిలాక్సింగ్ రొటీన్‌ను అలవాటు చేసుకోవాలి. ఆలస్యంగా అతి భోజనాలు, ఆల్కహాల్ లేదా భయానక కంటెంట్‌ను చూడటం మానుకోవాలి.
పీడకలలకు కొత్త శుభం కార్డును ఊహించుకుని.. దానిని పదేపదే మనసులో రిహార్సల్ చేయడం మంచిది. అయితే ఇలా చేసినా తరచుగా మిమ్మల్ని పీడకలలు ఇబ్బంది పెడుతుంటే డాక్టర్‌ను సంప్రదించడం ఉత్తమం.