Sunday, January 18, 2026
Homeగ్యాలరీBDL: బీడీఎల్‌లో భారీగా ఉద్యోగాలు.. డిగ్రీ ఉంటే చాలు!

BDL: బీడీఎల్‌లో భారీగా ఉద్యోగాలు.. డిగ్రీ ఉంటే చాలు!

BDL Notification: హైదరాబాద్‌లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. 80 మేనేజ్​మెంట్ ట్రైనీ పోస్టులకు గానూ నోటిఫికేషన్‌ జారీ చేసింది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు డిసెంబర్‌ 29లోగా ఆన్ లైన్లో అప్లయ్ చేసుకోవచ్చు.

- Advertisement -
job notification
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ లేదా టెక్నాలజీలో ఫస్ట్​క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ అర్హత ఉండాలి. సీఏ / ఐసీడబ్ల్యూఏఐ/ ఫస్ట్​క్లాస్ ఎంబీఏ లేదా సమాన అర్హత కలిగి ఉండాలి.
BDL Jobs
25-11-2025 నాటికి గరిష్ట వయోపరిమితిని 27 ఏండ్లు నిర్ణయించారు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
BDL job notification
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మల్టిపుల్ చాయిస్ రూపంలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. మొత్తం 150 ప్రశ్నలు ఇస్తారు. సంబంధిత సబ్జెక్ట్ నుంచి 100 ప్రశ్నలు 100 మార్కులకు, జనరల్ ఆప్టిట్యూడ్‌ నుంచి 50 ప్రశ్నలు 50 మార్కులకు ఇస్తారు. అయితే ప్రతి తప్పుడు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు.
bharat dynamics ltd
కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ టెస్ట్‌తో మెరిట్‌ సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. కంప్యూటర్ బేస్డ్ టెస్టుకు 85 శాతం. ఇంటర్వ్యూకు 15 శాతం ఉంటుంది.
BHARAT DYNAMICS LTD JOBS
కంప్యూటర్ ఆధారిత పరీక్ష 2026, జనవరి 11న ఉంటుంది. పూర్తి సమాచారం కోసం bdl-india.in వెబ్​సైట్​ను సందర్శించండి.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News