Saturday, November 15, 2025
HomeTop StoriesObesity In Children: పిల్లల్లో పెరుగుతున్న ఊబకాయం సమస్య.. కారణాలేంటో తెలిస్తే షాకవుతారు..!

Obesity In Children: పిల్లల్లో పెరుగుతున్న ఊబకాయం సమస్య.. కారణాలేంటో తెలిస్తే షాకవుతారు..!

Obesity In Children these are the Main Reasons: నేటి ఆదునిక యుగంలో పెద్దవారితో పోలిస్తే చిన్న పిల్లల్లోనే ఊబకాయం సమస్య పెరిగిపోతుంది. దీని వల్ల శరీర బరువుతో పాటు అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ కొవ్వు పేరుకుపోవడం వల్ల ఊబకాయం సమస్య ఏర్పడుతుంది. కేవలం మనం తీసుకునే ఆహారమే కాకుండా జన్యుపరమైన, జీవనశైలి, పర్యావరణ కారకాల వల్ల కూడా ఈ సమస్య ఎదురవుతుంది. పిల్లల్లో ఊబకాయానికి దోహదపడే కారణాలుంటో తెలుసుకుందాం.

పిల్లల్లో ఊబకాయానికి అత్యంత ప్రధాన కారణం ఆహార నియంత్రణ లేకపోవడంతో పాటు అస్తవ్యస్తమైన ఆహారపు అలవాట్లు. అధిక కేలరీలు, తక్కువ పోషకాలు ఉన్న ఆహారం అనగా ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, ప్యాక్ చేసిన స్నాక్స్, బేకరీ వస్తువులు, చిప్స్ వంటివి తీసుకోవడం వల్ల ఈ సమస్య అధికమవుతుంది. వాటిలో కేలరీలు, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. కానీ తక్కువ పోషకాలు ఉంటాయి.
శారీరక శ్రమ లేకపోవడం కూడా ఊబకాయం సమస్యకు మరో కారణంగా చెప్పవచ్చు. పిల్లలు అవుట్‌డోర్‌ గేమ్స్‌ కంటే ఇండోర్‌ గేమ్స్‌ ఆడటం వల్ల ఈ సమస్య అధికమవుతుంది. అంతేకాదు, అదే పనిగా సెల్‌ఫోన్లు, టీవీ చూడటం, వీడియో గేమ్‌లు ఆడటం వంటివి కూడా దీనికి కారణంగా చెప్పవచ్చు.
గేమ్స్‌, రన్నింగ్‌, స్విమ్మింగ్ వంటి శారీరక శ్రమ లేకపోవడం వల్ల కూడా శరీరంలో చేరిన అదనపు కేలరీలు ఖర్చు కావడం లేదు. అవి కొవ్వుగా మారి పేరుకుపోతున్నాయి. ఇది ఊబకాయానికి దారితీస్తుంది.
కొన్ని సందర్భాల్లో ఊబకాయం కుటుంబ చరిత్ర, వైద్యపరమైన అంశాలపై కూడా ఆధారపడి ఉంటుంది. తల్లిదండ్రుల్లో ఒకరికి లేదా ఇద్దరికీ ఊబకాయం సమస్య ఉంటే.. పిల్లలకు కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. కొన్ని అరుదైన జన్యుపరమైన సిండ్రోమ్‌లు కూడా ఊబకాయానికి దారితీసే ప్రమాదం ఉంది.
నిద్ర లేమి సమస్య కూడా ఊబకాయానికి కారణమని చెప్పవచ్చు. కనీసం 6 నుంచి 8 గంటలు నిద్ర లేకపోవడం వల్ల శరీరంలో హార్మోన్ల మార్పులు వచ్చి ఆకలి పెరుగుతుంది. ఇది ఊబకాయానికి దారితీస్తుంది. థైరాయిడ్ లేదా కొన్ని ఇతర వైద్య పరమైన కారణాలు కూడా బరువు పెరగడానికి కారణం కావచ్చు.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad