గుజరాత్‌కి చెందిన 900 ఏళ్ల నాటి చరిత్ర కలిగిన పటాన్ పటోలా ఫ్యాబ్రిక్.. అత్యంత ప్రాముఖ్యత కలిగిన చేనేత వస్త్రాల్లో ఒకటి.
ఈ పటాన్ పటోలా వస్త్రాన్ని రాజకీయ నాయకుల నుంచి బాలీవుడ్ సెలబ్రిటీల వరకూ అమితంగా ఇష్టపడుతున్నారు. పీఎం నరేంద్ర మోదీ సైతం ఈ ఫ్యాబ్రిక్ స్కార్ఫ్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
చాలా క్లిష్టమైన చేతి పనితో కూడిన ఈ పటాన్ పటోలా చీరను ఉత్పత్తి చేయడానికి కనీసం 6 నెలలు పడుతుందట. సాల్విస్, సోలిస్ అనే రెండు వర్గాల వారికే ఈ పటోలా చేనేత నైపుణ్యం తెలుసునట.
పటాన్ పటోలా వస్త్రంలోని చిహ్నాలు చాలావరకు సంతానోత్పత్తి, శక్తి, అదృష్టం, శ్రేయస్సుతో ముడిపడి ఉంటాయట. గుజరాతీ మహిళలు శుభ సందర్భాల్లో కచ్చితంగా ఈ చీరలు ధరిస్తారట.
ఆ కారణంగానే పటాన్ పటోలా చీరలు అత్యంత ధర పలుకుతాయట. నాణ్యమైన ఒరిజినల్ చీర ఖరీదు రూ. 1.50 లక్షల నుంచి రూ. 3.50 లక్షల వరకు ఉంటుందట.
అయితే మార్కెట్లో నకిలీ పటాన్ పటోలా నకిలీ ఫ్యాబ్రిక్ వస్త్రాలు వచ్చేస్తున్నాయి. వీటి ధర రూ. 2,000 నుంచి రూ. 3,000 వరకు ఉంటుంది.