
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సతీమణి అన్నా కొణిదల తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకున్నారు.
- Advertisement -

సోమవారం ఉదయం ఆమె శ్రీ వారి సుప్రభాత సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.

దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వచనం అందించారు.

ఆలయం ముందు గల అఖిలాండ వద్ద కర్పూరం వెలిగించి, కొబ్బరి కాయ సమర్పణ చేశారు.

కుమారుడు కొణిదల మార్క్ శంకర్ పేరిట తిరుమల తిరుపతి దేవస్థానానికి రూ. 17 లక్షల విరాళాన్ని అందించారు.

అనంతరం నిత్యాన్నదాన సత్రంలో భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించి, వారితో కలసి భోజనం చేశారు.

భక్తులతో కలసి అన్న ప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి పాల్గొన్నారు.