మొత్తం చూస్తే, పాదాల ఆకారం ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవడంలో ఆసక్తికరమైన క్లూ ఇస్తుంది. కానీ ఇది శాస్త్రీయంగా నిరూపితం కాదు. కాబట్టి దీన్ని కేవలం ఒక ఆసక్తికరమైన పరీక్షగా మాత్రమే చూడాలి.
ఈజిప్షియన్ పాదాల ఆకారం. ఇందులో బొటనవేలు పొడవుగా ఉండి, మిగతా వేళ్లు క్రమంగా తగ్గుతూ వుంటాయి. వీరు స్వతంత్రంగా ఆలోచించి, తమ నిర్ణయాలను గౌరవించే వ్యక్తులు. ఊహాశక్తి ఎక్కువగా ఉండి సృజనాత్మకతలో ప్రత్యేకత చూపుతారు. తమ సన్నిహితుల పట్ల విధేయత, నమ్మకాన్ని ప్రదర్శిస్తారు. రహస్యాలు ఉంచడంలో, మాట నిలబెట్టడంలో వీరు ముందుంటారు.
గ్రీకు పాదాల ఆకారం. ఈ పాదంలో రెండవ వేలు బొటనవేలు కంటే పొడవుగా ఉంటుంది. దీనిని ఫైర్ ఫుట్ అని కూడా అంటారు. ఇలాంటి వారు చాలా సృజనాత్మకులు. కొత్త ఆలోచనలు, ఆవిష్కరణల మీద వీరికి ఆసక్తి ఉంటుంది. రిస్క్ తీసుకోవడంలో భయపడరు. శక్తివంతంగా, చురుకుగా ఉండి ఎప్పుడూ కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. వీరు చుట్టూ ఉన్నవారికి స్ఫూర్తి కలిగించే వ్యక్తిత్వం కలిగి ఉంటారు.
చదరపు పాదాల ఆకారం. ఇందులో ఐదు వేళ్లూ దాదాపు సమానంగా ఉంటాయి. ఇలాంటి వారు ఆచరణాత్మకంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. బాధ్యతాయుతంగా, కష్టపడి పనిచేసే గుణం వీరిలో ఉంటుంది. ఓర్పు, పట్టుదల వీరి బలం. ఒకసారి లక్ష్యం పెట్టుకున్నాక దాన్ని తప్పకుండా సాధిస్తారు. ఇతరులకు విశ్వసనీయులుగా కనిపిస్తారు.
రోమన్ పాదాల ఆకారం. అంటే, ఈ పాదంలో బొటనవేలు, రెండు, మూడో వేళ్లు ఒకే పొడవుగా ఉంటాయి. ఇలాంటి వారు చాలా ఫ్రెండ్లీగా, ఇతరులతో సులభంగా కలిసిపోయే స్వభావం కలిగి ఉంటారు. నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉండటంతో ఏ పని అయినా ముందుండి చేస్తారు. నమ్మకం, పట్టుదల, ఆత్మవిశ్వాసం వీరి ప్రత్యేకతలు. అయితే కొన్నిసార్లు మొండితనం చూపించే అవకాశం ఉంటుంది.
ముఖ్యంగా కాలి పాదాల ఆకారం, వేళ్ల పొడవు, వాటి అమరిక ఆధారంగా వ్యక్తి మనస్తత్వం, అలవాట్లు, ఆలోచనల తీరు ఏ విధంగా ఉంటాయో అంచనా వేయవచ్చని నమ్ముతారు. చాలా కాలం క్రితం నుంచే ఈ శాస్త్రాన్ని ఉపయోగించి వ్యక్తుల లక్షణాలను తెలుసుకునే ప్రయత్నం జరుగుతోంది.
సాముద్రిక శాస్త్రం అనేది మన శరీర ఆకారాలను ఆధారంగా వ్యక్తిత్వాన్ని అంచనా వేసే ఒక ఆసక్తికరమైన శాస్త్రం. మన ముఖం, కళ్ళు, చేతులు మాత్రమే కాకుండా పాదాల ఆకారం కూడా మన స్వభావాన్ని వెల్లడిస్తుందని ఇందులో చెబుతారు.