తీసుకునే ఆహారం పై మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యాంగా ఉండాలంటే తరచుగా పండ్లు, తాజా కూరగాయలు తీసుకోవాలి. అయితే, పండ్లలో భాగంగా ఫైనాపిల్ విషయానికి వస్తే, ఇది తియ్యగా, రసభరితంగా ఉండటమే కాకుండా ఆరోగ్యం, అందానికి ఒక వరం లాంటిది. సీజన్ తో సంబంధం లేకుండా ఈ పండు శరీరానికి శక్తిని, పోషణను అందిస్తుంది. అంతేకాకుండా ఇది చర్మం, జుట్టుకు కూడా ఎంతో మేలు చేస్తుంది.
గుండె ఆరోగ్యానికి ఫైనాపిల్ ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ గుండె జబ్బుల నుండి రక్షణ కల్పిస్తాయి.
ఫైనాపిల్ తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్ కలిగి ఉంటుంది. దీంతో ఈ పండు ఎక్కువ సమయం కడుపు నిండిన భావన కలిగిస్తుంది. పాదే పదే తినే అలవాటును నివారించవచ్చు.
ఇందులో ఉండే మాంగనీస్ ఎముకల బలం, కీళ్ల ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి. క్రమం తప్పకుండా తీసుకుంటే ఎముకలు బలంగా ఉంటాయి.
ఇందులో ఉండే బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కడుపులో గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేస్తుంది.
పైనాపిల్లో ఉండే బ్రోమెలైన్, విటమిన్ సి చర్మంపై ఉండే మృతకణాలను తొలగించి, చర్మాన్ని కాంతివంతంగా మార్చుతాయి.
అనాస పండులో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లకు పోషణనిస్తాయి.
విటమిన్ సి పుష్కలంగా ఉండే ఈ పండు శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధుల నుండి రక్షిస్తుంది.