ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ శ్రీశైలం మల్లన్నను గురువారం దర్శించుకున్నారు. ప్రధానితో పాటు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు.
అర్చకులు, ఆలయ అధికారులు ప్రధాని నరేంద్ర మోదీకి పూర్ణకుంభంతో లాంఛనంగా స్వాగతం పలికారు.
అనంతరం భ్రమరాంబాదేవి సమేత మల్లికార్జున స్వామివారికి ప్రధాని మోదీ పూజలు చేశారు.
మల్లన్నకు పంచామృతాలతో రుద్రాభిషేకం, భ్రమరాంబకు ఖడ్గమాల, కుంకుమార్చన పూజలు చేశారు.
మోదీ పర్యటన నేపథ్యంలో శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటున్నాయి.