పూజా హెగ్డే ఈ పేరు వింటే చాలు.. కుర్రకారు గుండె లయ తప్పుతుంది. వెల్లువొచ్చే గోదారమ్మ అంటూ కుర్రాళ్ల మనసుని దోచుకుంది. పూజా నాజూకు నడుము, అందమైన ఆ కాళ్లకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే ఆశ్చర్యం లేదు.
తెలుగు, తమిళ భాషల్లో వరుసగా సినిమాలు చేసిన పూజా హెగ్డే.. ఇప్పుడు సౌత్ సినిమాలకు దూరంగా ఉంటోంది. బాలీవుడ్లో వరుసగా సినిమాలు చేస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.
ఇటీవల కూలీ సినిమాలో మోనికా బెలూచీ పాటతో ఉర్రూతలూగించింది ఈ ముద్దుగుమ్మ. వాట్సప్‌లో ఉండే డ్యాన్సింగ్ ఎమోజీకి ఈ చిన్నది న్యాయం చేసిందంటూ పొగడ్తలతో ఫ్యాన్స్ ముంచెత్తారు.
కాగా, పూజా హెగ్డే ఇటీవల సినీ ఇండస్ట్రీపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సెట్స్‌లో హీరోలకి ఇచ్చిన మర్యాదలు హీరోయిన్లకి ఇవ్వరంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ న్యూస్ చెప్పింది.
క్యారవాన్లు కూడా సెట్‌కి దగ్గరలో ఉండవని.. బరువైన డ్రెస్సులతో దూరంలో ఉన్న క్యారవాన్‌కు నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తుందని అసహనం వ్యక్తం చేసింది.
హీరోయిన్లని కేవలం గ్లామర్‌కే పరిమితం చేస్తారని.. కానీ సినిమా మీద ప్రేమతో ఈ ఇబ్బందులన్నీ భరిస్తున్నామని పూజా చెప్పుకొచ్చింది. కాగా, పూజా చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
కాగా, దుల్కర్ సినిమాలో పూజా హెగ్డే రూ. 3 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్‌లో సింప్లిసిటీ లుక్‌తో పూజా ఆకట్టుకుంటోంది.