
కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకున్న హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్.

1991 జనవరి 12న జన్మించిన ప్రగ్యా.. ముందుగా కొన్ని యాడ్ ఫిల్మ్స్‌లో నటించింది. 2014లో తెలుగు, తమిళ్ బై లింగ్వల్ డేగ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో 2015లో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ‘కంచె’ సినిమాతో పరిచయమైంది.

తొలి సినిమాతోనే బెస్ట్ ఫీమేల్ డెబ్యూ అవార్డు కైవసం చేసుకుంది. ఆ తర్వాత పలు సినిమాలు చేసినా ఈ అమ్మడికి పెద్దగా కలిసి రాలేదు.

నక్షత్రం (2017), మంచు విష్ణుతో చేసిన ఆచారి అమెరికా యాత్ర సినిమాలు ఈమెకు సక్సెస్ ఇవ్వలేకపోయాయి. అయితే బాలయ్య అఖండ, డాకు మహరాజ్ సినిమాలతో మళ్లీ సక్సెస్ బాట పట్టింది ప్రగ్యా.

అటు సినిమాల్లో నటిస్తూనే ఇటు సోషల్ మీడియాలో సెగలు పుట్టించడం షురూ చేసింది ఈ అందాల తార. ఎప్పటికప్పుడు హాట్ లుక్స్ షేర్ చేస్తూ కుర్రకారుకు మైకం తెప్పిస్తోంది ఈ భామ.
తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.