
టాలీవుడ్ బ్యూటీ ప్రణీత సుభాష్ ను తాజాగా దిగిన ఫోటోలను అభిమానులు షాక్ అవుతున్నారు. ప్రణిత రీసెంట్‌గా దిగిన ఫోటోలను షేర్ చేసింది.

పారిస్ ఫ్యాషన్ వీక్‌లో పాల్గొన్న తొలి తెలుగు నటిగా కూడా ఆమె ఘనత సాధించింది.

ప్రణిత సుభాష్ కు టాలీవుడ్ లో ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అయితే కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే పెళ్లి, పిల్లలు, కాపురం అంటూ సినిమాలకు దూరంగా ఉంటోంది.

ప్రణిత సుభాష్ 2021లో వ్యాపారవేత్త నితిన్ రాజును వివాహం చేసుకుంది. కుమార్తె అర్నా 2022లో జన్మించింది. తరువాత, ప్రణత సుభాష్ ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది.

పెళ్లి తర్వాత సిల్వర్ స్క్రీన్‌కి దూరమైనపప్పటికి సోషల్ మీడియాలో మాత్రం రెగ్యూలర్‌గా తన అప్‌డేట్స్ షేర్ చేస్తోంది ఈ అందాల సుందరి.

తాజాగా పారిస్ వీధిలో కెమెరాకు పోజులిచ్చిన ప్రణీత. తల్లి అయిన తర్వాత ఆ నటి మరింత అందంగా మారింది. లోదుస్తులు, దానిపై కోటు, ప్యాంటు వేసుకుని తన అందాలను చూపించింది.

పారిస్ ఫ్యాషన్ వీక్ ముందే దుబాయ్‌లో జరిగిన ఫ్యాషన్ షోలో తళుక్కున మెరిసింది. అక్కడ కూడా తగ్గేదేలే అన్నట్లుగా ర్యాంప్ వాక్ చేసి కేక పుట్టించింది ప్రణీత.

ప్రణీత తరచుగా మోడ్రన్ డ్రెస్ ఫోటోషూట్లను షేర్ చేస్తుంది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ అందమైన ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్లకు నిద్ర కరువు చేస్తోంది ఈ బ్యూటీ.