PM Modi played football: రాజకీయాల్లో ఎప్పుడూ బిజీగా ఉండే ప్రధాని మోదీ.. సిక్కిం పర్యటనలో ఉల్లాసంగా గడిపారు. గ్యాంగ్‌టక్‌లో పర్యటిస్తున్న ఆయన.. స్థానిక యువతతో కలిసి సరదాగా ఫుట్‌బాల్ ఆడారు. దేశ ప్రధాని తమతో కలిసి ఆట ఆడటంతో అక్కడి క్రీడాకారులు ఉత్సాహంతో ఉరకలేశారు.
- Advertisement -
సిక్కిం పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ గ్యాంగ్‌టక్‌లో యువతీ యువకులతో సరదాగా గడిపారు. ఫుట్‌బాల్ ఆడుతున్న యువతను గమనించిన మోదీ.. నేరుగా వారి వద్దకు వెళ్లారు. వారితో కాసేపు ముచ్చటించిన ప్రధాని.. తాను కూడా ఫుట్‌బాల్ ఆడతానని సరదాగా అన్నారు.
అంతటితో ఆగకుండా స్పోర్ట్స్ జెర్సీ ధరించి పూర్తిస్థాయి క్రీడాకారుడిలా మైదానంలోకి దిగారు. దీంతో యువతతో మోదీ ఫుట్‌బాల్ ఆడారు.కేవలం బంతిని తన్నడమే కాకుండా.. తన నైపుణ్యంతో గోల్స్ వేసి అక్కడున్న వారందరినీ మంత్రముగ్ధులను చేశారు.క్రీడల ప్రాముఖ్యత గురించి, ఫిట్‌నెస్ గురించి అక్కడి క్రీడాకారులతో ప్రధాని ప్రత్యేకంగా చర్చించారు. ఈ అపురూప ఘట్టాలకు సంబంధించిన ఫోటోలను ప్రధాని స్వయంగా తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు.“యువ క్రీడాకారుల శక్తి సామర్థ్యాలు చూస్తుంటే ముచ్చటగా ఉంది” అని ఆయన పేర్కొన్నారు. సిక్కిం పర్యటనలో ప్రధాని చేసిన ఈ పనికి సంబంధించిన చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.