Priya Prakash Varrier: కనుసైగతో ఓవరనైట్ స్టార్ డమ్ తెచ్చుకుంది మలయాళీ ఫేమ్ ప్రియా ప్రకాష్ వారియర్. ఈ కుట్టి లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇందులో దివి నుంచి దిగొచ్చిన దేవకన్యాలా మెరిసిపోతుంది ప్రియా.
‘ఒరు అధార్ లవ్’ సినిమాలో కనుసైగ చేసి ఓవర్ నైట్ లో స్టార్ డమ్ తెచ్చుకుంది ప్రియా ప్రకాష్ వారియర్.
నితిన్ హీరోగా నటించిన చెక్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఈ మూవీ బాక్సాపీస్ వద్ద బోల్తా కొట్టింది.
ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ నటించిన బ్రో సినిమాలో నటించినప్పటికీ తెలుగులో అనుకున్నంత గుర్తింపు రాలేదు.
ఇటీవల ఈ అమ్మడు నటించిన జాబిలమ్మ నీకు అంత కోపమా, గుడ్ బ్యాడ్ అగ్లీ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయవంతమయ్యాయి.
ఈమె 2023లో నటించిన మలయాళ క్రైమ్ థ్రిల్లర్ ‘కొల్లా’ రెండేళ్ల తర్వాత తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చింది. ఇది ఈటీవీ విన్ లో ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ మలయాళీ కుట్టి తన గ్లామర్ తో కుర్రాళ్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
ఇటీవల ఈ బ్యూటీ కొలనులో జలక్రీడలాడుతూ దిగిన ఫోటోలను ఇన్ స్టాలో షేర్ చేసింది. అవి కాస్త నెట్టింట వైరల్ గా మారాయి.