రత్తాలు రత్తాలు ఓసి ఓసి రత్తాలు నిన్ను చూస్తే నిలబడనంటాయ్ నా చొక్కా బొత్తాలు!
శ్రీకాంత్‌తో ‘కాంచనమాల కేబుల్ టీవీ తో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత ‘అధినాయకుడు’ లాంటి సినిమాలు చేసింది. కానీ తెలుగులో హీరోయిన్గా పెద్దగా నిలదొక్కుకోలేకపోయింది.
హీరోయిన్గా పెద్ద హిట్లు రాకపోయినా, ఆమెకు మలయాళంలో మంచి గుర్తింపు వచ్చింది. తెలుగు, తమిళంలో ఆమెకు పెద్ద బ్రేక్ ఇచ్చింది మాత్రం ఐటెం సాంగ్స్!
తెలుగులో ‘బలుపు’ (లక్కీ లక్కీ రాయ్), ‘సర్దార్ గబ్బర్ సింగ్’ (తోబా తోబా), ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవితో చేసిన ‘ఖైదీ నెం. 150’ లోని ‘రత్తాలు రత్తాలు’ పాట ఆమెకు ఎనలేని పాపులారిటీని తెచ్చాయి. ఈ ఒక్క పాటతో ఆమె తెలుగు ప్రేక్షకులకు ‘రత్తాలు’గా గుర్తుండిపోయింది.
తన కెరీర్లో క్రికెటర్ ఎం.ఎస్. ధోనితో డేటింగ్, ఎఫైర్స్ విషయంలో ఆమె పేరు తరచుగా వార్తల్లో నిలిచింది. ఈ రిలేషన్షిప్ గురించి తనే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది కూడా.
ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ను ఒక పర్సనల్ గ్లామర్ స్క్రీన్‌గా వాడుకుంటోంది. రెగ్యులర్‌గా బికినీలు, స్విమ్సూట్లలో బోల్డ్ ఫొటోషూట్లు పోస్ట్ చేస్తూ, సోషల్ మీడియాలో నిత్యం ట్రెండింగ్‌లో ఉంటోంది
మొత్తం మీద, రాయ్ లక్ష్మి ఇప్పుడు ‘సినిమా హీరోయిన్’ కంటే, ‘గ్లోబల్ గ్లామర్ డాల్’ మరియు ‘సోషల్ మీడియా సెన్సేషన్’ లాంటి లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది.