తిరుమలలో సూర్యప్రభ వాహనంతో రథసప్తమి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి.తేజో నిధి, సకల రోగ నివారకుడు, ప్రకృతి చైతన్య ప్రదాత అయిన సూర్యని వాహనంగా అధిరోహించి భక్తులను కటాక్షించారు శ్రీ మలయప్ప స్వామిసూర్య జయంతిని పురస్కరించుకొని తిరుమాఢ వీధుల్లో విహరిస్తూ శ్రీ మలయప్ప స్వామి సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చారు.తిరుమాఢ వీధుల్లో విహరిస్తున్న మలయప్ప స్వామి వారిని దర్శించుకునేందుకు అశేష సంఖ్యలో భక్తులు తిరుమాడ వీధులు చేరుకుని గోవిందుడికి మంగళ హారతులు పలికారుతిరుమాఢ వీధుల్లో విహరిస్తున్న మలయప్ప స్వామి వారిని దర్శించుకునేందుకు అశేష సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. వచ్చిన భక్తులకు ప్రసాదాలను అందజేశారు.మాడవీధులంతా గోవిందా నామ స్మరణతో మారుమ్రోగింది. అర్చక స్వాములు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి హారతి సమర్పించారు. అదే సమయంలో గ్యాలరీల్లో వేచివున్న భక్తులు గోవిందనామ స్మరణలతో స్వామి వారిని దర్శించుకున్నారు