RBI Recruitment 2025: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ మొత్తం 28 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో లీగల్ ఆఫీసర్ పోస్టులు, టెక్నికల్ సివిల్ మేనేజర్, టెక్నికల్ ఎలక్ట్రికల్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ అఫీషియల్ లాంగ్వేజ్, అసిస్టెంట్ మేనేజర్ ప్రోటోకాల్స్ & సెక్యూరిటీ పోస్టులు ఉన్నాయి.
- Advertisement -
లీగల్ ఆఫీసర్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తి గల అభ్యర్థులు యూజీసీ గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి 50 శాతం మార్కులతో డిగ్రీ కలిగి ఉండాలి. బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా నమోదు చేసుకోవాలి.
ఇక మేనేజర్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో డిగ్రీ కలిగి ఉండాలి.
అసిస్టెంట్ మేనేజర్ అఫీషియల్ లాంగ్వేజ్ పోస్టుకు హిందీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థుల కనీస వయస్సు 21, 25 సంవత్సరాలుగా నిర్థారించారు. గరిష్ట వయస్సు 40 సంవత్సరాల లోపు ఉండాలి. ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జనరల్, ఓబీసీ, EWS అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ. 600గా ఉండగా..ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల అభ్యర్థులకు రూ. 100గా ఉంది. జులై 31 లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.