ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ రియల్మీ త్వరలో భారత్‌లో తన బడ్జెట్ 5G ఫోన్ Realme C85 5Gని విడుదల చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే వియత్నాంలో లాంచ్ కాగా.. భారత్‌లో లాంచ్‌కు సిద్ధంగా ఉంది.
నవంబర్ చివర్లో లాంచ్ కానున్నట్లు కంపెనీ వెల్లడించింది. Realme C85 5G దాదాపు రియల్మీ 15x లాగానే ఉంటుందని సమాచారం.
ఈ స్మార్ట్‌ఫోన్ అక్టోబర్‌లో భారతమార్కెట్లో రూ. 9,999 ప్రారంభ ధరకు లాంచ్ అయిన Realme 15x 5G లాగానే ఉంటుందని సమాచారం.
Realme 15x ఫోన్ 50-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 60W SuperVOOC వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది.
కాగా, Realme C85 5G.. 8-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఇది 45W ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.
భారత మార్కెట్లో త్వరలో రాబోయే Realme C85 5G ధర ప్రస్తుతం ఉన్న Realme 15x 5G కంటే కొంచెం తక్కువగా ఉంటుందని మార్కెట్ వర్గాల అంచనా.