మీ వాషింగ్ మెషీన్ బట్టలు సరిగ్గా శుభ్రం చేయకపోతే తొందరపడి టెక్నీషియన్‌ను పిలవకండి. దానికి గల కారణాలు, పరిష్కారాలను తెలుసుకుంటే డబ్బు, సమయం ఆదా అవుతుంది.
వాషింగ్ మెషీన్ ఓవర్‌లోడ్ అయినప్పుడు నీరు, డిటర్జెంట్ బట్టలన్నింటినీ సరిగ్గా చేరుకోలేవు. మెషీన్ సామర్థ్యం ప్రకారం బట్టల్ని ఉతికేందుకు వేయాలి.
మెషీన్లో నీటి పరిమాణం లేదా పీడనం తక్కువగా ఉండకూడదు. ఇన్లెట్ వాల్వ్ శుభ్రంగా ఉందా లేదా చెక్ చేసుకోవాలి.
సరైన డిటర్జెంట్ అందుబాటులో లేకపోయినా లేదా పరిమాణం తక్కువగా ఉంటే, మురికి పూర్తిగా వదలదు. వీటి కోసం హై ఎఫిషియెన్సీ డిటర్జెంట్‌ను మాత్రమే ఉపయోగించాలి.
“హెవీ”, “కాటన్” లేదా “ఇంటెన్సివ్ వాష్” ఇలా మీరు వేసే బట్టలను బట్టి వాష్ మోడ్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. మురికిగా ఉన్నదాని ఆధారంగా వాష్ సైకిల్‌ను సెట్ చేసుకోవాలి.
మెషీన్ డ్రమ్, ఫిల్టర్ లేదా పైపుల్లో మురికి పేరుకుపోయి ఉంటే అది బట్టలపై ప్రభావం చూపిస్తుంది. నెలకోసారి వెనిగర్ లేదా మెషీన్ క్లీనర్ వేసి యంత్రాన్ని క్లీన్ చేయాలి.
బట్టలపై నూనె, ధూళి, చెమట మరకలు ఉంటే వాటిని నేరుగా యంత్రంలో వేయకుండా మొదటగా సబ్బుతో తేలికగా రుద్ది, ఆపై వాటిని మెషీన్లో వేస్తే ఫలితం ఉంటుంది.