పారామెడికల్ ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) సికింద్రాబాద్ ఒక భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న 434 పారామెడికల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.
నర్సింగ్ సూపరింటెండెంట్, డయాలిసిస్ టెక్నీషియన్, హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్-2, ఫార్మసిస్ట్, ఈసీజీ టెక్నీషియన్ వంటి పోస్టులు ఉన్నాయి.
అభ్యర్థులు ఆర్ఆర్బీ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.పోస్టును బట్టి కనీస వయస్సు 18 సంవత్సరాల నుంచి గరిష్ట వయస్సు 40 సంవత్సరాల మధ్య ఉండాలి.