RRB Recruitment 2025: నిరుద్యోగులకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త అందించింది. టెక్నీషియన్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 6,238 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

టెక్నీషియన్ గ్రేడ్-1 సిగ్నల్, టెక్నీషియన్ గ్రేడ్-3 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. ఆసక్తి, అర్హత గత అభ్యర్థులు rrbapply.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు: టెక్నీషియన్ గ్రేడ్-1 సిగ్నల్ పోస్టులు -183, టెక్నీషియన్ గ్రేడ్-3 పోస్టులు : 6,055

ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 28 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. జులై 28వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.

దరఖాస్తు ఫీజు ఓబీసీ, జనరల్ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్, పీడబ్ల్యూబీడీ, మహిళలు, మైనార్టీలు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.250

ప్రారంభ వేతనం: టెక్నీషియన్ గ్రేడ్-1 సిగ్నల్ పోస్టుకు రూ.29,200, టెక్నీషియన్ గ్రేడ్-3 పోస్టుకు రూ.19,900

ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.