
క్యూట్ క్యూట్ చిన్నది.. శాన్వి మేఘన తెలుగు ప్రేక్షకులకు పరిచయమే.

టాలీవుడ్ కి వచ్చిన ఈ బ్యూటీ తక్కువ సమయంలోనే మంచి పేరు తెచ్చుకుంది.

12 సెప్టెంబర్ 1997 తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో జన్మించింది.

శాన్వి తండ్రి వంశీ కిషోర్ వ్యాపారవేత్త కాగా.. తల్లి పద్మ మందుముల గృహిణి.

2019లో బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టింది ఈ వయ్యారి భామ.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, పుప్పక విమానంతో సహా అనేక చిత్రాల్లో కనిపించింది.

పుష్పక విమానం సినిమాలో శాన్వి మేఘన నటన ఆకట్టుకుంటోంది. ఈ సినిమా తర్వాత ఆమెకు ఆఫర్లు మరింత పెరిగాయి.

ఇక 2021లో నెట్ ఫ్లిక్స్ సిరీస్ పిట్ట కథలు తో OTTలో అరంగేత్రం చేసింది. ఇందులో ఆమె రాముల పాత్రను పోషించింది.

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే శాన్వి.. తన ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తుంటుంది.

తాజాగా శాన్వి మేఘన కొన్ని ఫోటోలను షేర్ చేయగా.. కుర్రకారు కొంటె కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు.