Saturday, November 15, 2025
Homeగ్యాలరీSadar festival: సంబరంగా సదర్‌ వేడుకలు.. ఆకట్టుకున్న దున్నరాజుల విన్యాసాలు!

Sadar festival: సంబరంగా సదర్‌ వేడుకలు.. ఆకట్టుకున్న దున్నరాజుల విన్యాసాలు!

ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం నేతృత్వంలో ఘనంగా సదర్ వేడుకలకు జరిగాయి. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

- Advertisement -
శ్రీ కృష్ణ సదర్‌ సమ్మేళనం నేతృత్వంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో దీపావళి సదర్‌ వేడుకల్ని సంబరంగా నిర్వహించారు.
దున్నరాజుల విన్యాసాలు.. కళాకారుల నృత్యాలు, డప్పు చప్పుళ్లు, శంఖారావాలు, ఆటపాటలు, వీఐపీల సందడితో ఆదివారం ఇందిరా పార్కు ధర్నా చౌక్‌ దద్దరిల్లింది.

సీఎం రేవంత్‌ రెడ్డితో పాటు పలువురు మంత్రులు,ఎంపీలు, ఎమ్మెల్యేలు, పలు రాజకీయ పారీ్టల నేతలు ఈ ఉత్సవానికి భారీగా తరలివచ్చారు.

ఎంపీ అనిల్‌ కమార్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో సదర్‌ సమ్మేళనం జరగ్గా..జంటనగరాల నుండి యాదవులు వారి దున్న పోతులను అందంగా అలంకరించి తీసుకువచ్చారు. దాదాపు నాలుగైదు గంటలపాటు వాటి విన్యాసాలు వీక్షకులను అలరించాయి.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad