
స్టార్ హీరోయిన్ సమంత తనదైన నటనతో సినీ ఇండస్ట్రీలో స్టార్‌డమ్ సంపాదించుకుంది.

2010లో ఏం మాయ చేసావే సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆమె నటనా ప్రతిభతో అభిమానులను సంపాదించుకుంది.

ఇక సమంతను మెర్క్యూరీ లాంటి అమ్మాయి అంటారు, ఎందుకంటే ఏ డ్రెస్సింగ్ స్టైల్ లోనైనా ఈజీగా ఫిట్ అవుతారు.

సిల్వర్ స్క్రీన్‌పై మోడ్రన్ & ట్రెడిషనల్ రోల్స్‌తో ఆకట్టుకున్న సమంత లేటెస్ట్ ఫోటోషూట్ స్టైలిష్‌గా కనిపించింది.

సమంత తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. సమంత తన లుక్‌ను ట్రెడిషనల్, మోడ్రన్ మిక్స్ తో ప్రెజెంట్ చేశారు.

ఈసారి ఆమె చీరను పూర్తి స్థాయిలో కట్టుకోలేదు, స్టైలిష్‌గా డిజైన్ చేయించుకున్నారు. ప్రత్యేకంగా బ్లౌజ్‌పై టర్టెల్ నెక్ డిజైన్ కోట్ వేసుకుని తన లుక్‌కి న్యూ డెప్త్ ఇచ్చారు.

డ్రెస్సింగ్‌తో పాటు హెయిర్ స్టైల్ కూడా సమంత లుక్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చింది. ఆమె అసిస్టెంట్ హెయిర్ స్టైల్ సెట్ చేస్తున్న సమయంలో తీసిన ఓ ఫోటో ప్రత్యేకంగా వైరల్ అవుతోంది.