Saturday, November 15, 2025
Homeగ్యాలరీCustard Apple: ఆరోగ్య ప్రదాయిని సీతాఫలం.. దీనితో వచ్చే బెనిఫిట్స్ తెలిస్తే అస్సలు వదలరు

Custard Apple: ఆరోగ్య ప్రదాయిని సీతాఫలం.. దీనితో వచ్చే బెనిఫిట్స్ తెలిస్తే అస్సలు వదలరు

- Advertisement -

Seasonal fruit Custard Apple Benfits: సీజనల్ ఫ్రూట్స్‌లో సీతాఫలాలకు ఉండే స్పెషాలిటీయే వేరు. నోటికి రుచికరంగా, తీపిగా ఉండే పండ్లలో నేచురల్ షుగర్స్ ఎక్కువగా ఉంటాయి. ఎంతో రుచికరమైన ఈ పండ్లు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి.

ఎన్నో పోషకాలకు నిలయం సీతాఫలం. అందుకే ఈ పండ్లను పిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా అందరూ చాలా ఇష్టంగా తింటారు.
సీతాఫలాల్లో రకరకాల రెసిపీలు కూడా అందుబాటులోకి వచ్చాయి. సీతాఫలంతో ఐస్ క్రీమ్స్ కూడా తయారు చేస్తున్నారు. ఎన్నో వెరైటీలు మార్కెట్‌లోకి వచ్చేశాయి.
సీతాఫలం పండులో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీంతో పాటు విటమిన్ సీ, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. సీతాఫలంలో నేచురల్ షుగర్స్ అధికంగా ఉంటాయి.
సీతాఫలాన్ని ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా బ్రేక్ ఫాస్ట్ టైమ్ లేదా భోజనానికి ముందు తీసుకుంటే మంచిది. దీని వల్ల షుగర్ అనేది సరైన విధంగా ప్రాసెస్ అవుతుంది.
అయితే, సీతాఫలాన్ని అధికంగా తీసుకోవడం కూడా అంత మంచిది కాదు. మీ డైట్‌లో మార్పులు చేర్పులు చేసే ముందు కచ్చితంగా డాక్టర్‌ని సంప్రదించడం మంచిది.
తక్షణమే శక్తిని అందించడంలోనూ సీతాఫలం సహయపడుతుంది. కాకపోతే మోతాదు విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు ఎక్స్ పర్ట్స్.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad