Skin Infection Signals: శరీరంలో అన్ని భాగాలకు రక్షణగా ఉండే అతి పెద్ద అవయవం చర్మం. ఒక్కోసారి చర్మం దురదగా అనిపిస్తే లైట్ తీసుకుంటాం. కానీ అవి ఇన్ఫెక్షన్లను దారి తీయవచ్చని.. కొన్ని సంకేతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని డెర్మటాలజిస్టులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం.
చర్మంపై ఎక్కడైనా ఎర్రగా మారి వాపుగా అనిపిస్తూ అది అలాగే వ్యావ్తించినట్లయితే ఇన్ఫెక్షన్ బాడీలోకి ప్రవేశిస్తుందని అర్థం. ఇది సెల్యులైటిస్ అనే బాక్టీరియల్ ఇన్ఫెక్షన్.
మీ చర్మంలోని ఏదైనా ఒక చోట వేడిగా అనిపించినట్లయితే శరీరం ఇన్ఫెక్షన్కు గురైనట్లు అర్థం.
చర్మంపై ఏదైనా గడ్డ లేదా గాయం నుంచి పసుపు లేదా ఆకుపచ్చ కలర్లో ద్రవం స్రవిస్తున్నట్లయితే అది చీము కావచ్చు. ఇది ఇంపెటిగో అనే బాక్టీరియల్ ఇన్ఫెక్షన్. దీని పట్ల అప్రమత్తంగా ఉండాలి.
ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్న చాలా మందిలో తీవ్రమైన దురద ఉంటుంది. స్టెరాయిడ్ క్రీములను అధికంగా వాడటం వల్ల ఇది వ్యాపిస్తుంది.
చర్మంపై బుడగలు, బొబ్బలు.. హెర్పెస్ జోస్టర్(షింగిల్స్) లేదా బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వంటి వైరల్ ఇన్ఫెక్షన్కు సంకేతం.
కొన్నిసార్లు ఇవేమీ లేకపోయినా జ్వరం, చలి లేదా తీవ్ర అలసట కూడా స్కిన్ ఇన్ఫెక్షన్కు దారి తీయవచ్చు. బాక్టీరియా రక్తంలోకి ప్రవేశించడం వల్ల ఇది సంభవిస్తుంది.