ప్రస్తుతం మీన రాశిలో సంచరిస్తున్న శని వల్ల ఆరు రాశులకు శని దోషం ఏర్పడగా.. అక్టోబర్ మొదటి వారం వరకూ వారికి తాత్కాలిక విరామం లభించింది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. ఆ రాశులు ఏంటంటే..
మేష రాశి వారికి ఏలినాటి శని దోషం బాగా తగ్గిపోయి, శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం కనిపిస్తుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలపడతాయి. విదేశీ అవకాశాలు లభిస్తాయి. ఆదాయం ఆశించిన స్థాయికి క్రమంగా పెరిగే అవకాశం ఉంది.
సింహ రాశి వారికి వృత్తి, ఉద్యోగ, కుటుంబ జీవితంలో అనేక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. రాజకీయ ప్రముఖులతో పరిచయాల్లో వృద్ధి, రాజకీయాల్లో ఉన్నవారికి రాజయోగం ప్రాప్తిస్తుంది. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరగడమే కాకుండా.. ఊహించని అపర కుబేర యోగం పొందొచ్చు.
కన్య రాశివారికి శని దోషం చాలావరకు తొలగిపోయి, మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక వృద్ధి, ఆదాయం పెరగడం, వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. శుభకార్యాలు జరుగుతాయి.
అర్ధాష్టమ శనితో అవస్థలు పడుతున్న ధనుస్సు రాశివారికి సామాజిక గౌరవం, సమర్థతకు, ప్రతిభకు ఆశించిన గుర్తింపు, అధికారుల నుంచి ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. నిరుద్యోగులు ఆశించిన ఉద్యోగంలో స్థిరపడతారు. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి.
కుంభ రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం, ప్రాధాన్యం, ఆర్థికంగా స్థిరత్వంతో పాటు రాదనుకుని వదిలేసుకున్న సొమ్ము కూడా చేతికి అందుతుంది. శారీరక, మానసిక ఒత్తిడి దూరమవుతుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు, ఆదాయానికి లోటు ఉండదు.
మీన రాశి వారికి పెండింగ్ పనులు పూర్తవుతాయి. ఆర్థిక వ్యవహారాలన్నీ చక్కబడతాయి. ఏ ప్రయత్నమైనా సునాయాసంగా నెరవేరుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారం, వారసత్వ సంపద కలిసిరావడం. వైద్య ఖర్చులు బాగా తగ్గిపోతాయి. వృత్తి, ఉద్యోగాల్లో వృద్ధి లభిస్తుంది.