యాంకర్ శివజ్యోతి అలియాస్ జ్యోతక్క దంపతులు మరి కొద్ది నెలల్లో తల్లిదండ్రులు కాబోతున్నారు. పెళ్లయిన పదేళ్లకి పేరెంట్స్ కాబోతుండటంతో వారి సంతోషానికి అవధులు లేవు.
ప్రస్తుతం ఐదో నెలతో ఉన్న శివజ్యోతి సీమంతం వేడుకల ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు కంగ్రాట్స్ చెబుతున్నారు.
ఈ విషయాన్ని శివజ్యోతి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ శుభవార్త చెప్పింది. ఆ ఏడుకొండల వెంకన్నస్వామి దయతో మాకు 2026లో బిడ్డ రాబోతుందంటూ సంతోషాన్ని వ్యక్తం చేసింది.
తమకు బిడ్డ కలగాలని ఎంతోమంది కోరుకున్నారని.. వారి ఆశీర్వాద బలంతో ఇన్నాళ్లకి ఈ అదృష్టం కలిగిందంటూ శివజ్యోతి ఎమోషనల్గా పోస్ట్ చేసింది.
మా ఇద్దరి హృదయాలు ఓ చిన్ని గుండె చప్పుడు కోసం ఎదురుచూస్తున్నాయంటూ సీమంతం ఫొటోలను షేర్ చేసింది.
తీన్మార్ వార్తలతో సావిత్రిగా పాపులర్ అయిన శివజ్యోతి.. తర్వాత బిగ్ బాస్ సీజన్లో అడుగుపెట్టి ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది.