
నన్ను దోచుకుందువటే చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయిన ముద్దుగుమ్మ నభా నటేష్.

ఇస్మార్ట్ శంకర్‌లో హీరోయిన్‌గా నటించి బంపర్ హిట్ కొట్టింది ఈ ముద్దుగుమ్మ.

అయితే తెలుగులో స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వస్తున్న సమయంలో నభా నటేష్ అనుకోని రోడ్డు ప్రమాదం కారణంగా సినిమాలకు దూరం అయ్యింది.

ప్రస్తుతం నభా నటేష్‌కు ప్రస్తుతం తెలుగులో అవకాశాలు కరువయ్యాయి.

మొదట్లో వరుసగా అవకాశాలు అందుకున్న ఈ కన్నడ అందానికి తెలుగులో ఇప్పుడు ఒక్క అవకాశం కూడా లేకుండా పోయింది.

వరుసగా సినిమాలు చేయడం.. ఆ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర తుస్సుమనడంతో అవకాశాలు తగ్గాయి.

దీంతో సోషల్ మీడియాలో తన ఫోటోలతో ఫాలోవర్స్‌కు టచ్‌లో ఉంటోంది నభా నటేష్.

ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫ్యాషన్ వేర్స్ ధరిస్తూ.. వాటికి సంబంధించిన ఫోటోలను నభా తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేస్తూ ఉంటోంది.

తాజాగా శివరాత్రి స్పెషల్ ఫోటోలను ఈ ముద్దుగుమ్మ పంచుకుంది.

చీరలో కట్టుకొని ఫోటోలకు ఫోజులిచ్చింది నభా నటేష్. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి.